నిజాంపట్నం మండలం గరువుపాలెం పంచాయతీలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుందని గ్రామ సర్పంచ్ శంకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు పాల్గొంటారన్నారు. అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ ప్రజా ప్రతినిధులు , అధికారులు, వాలంటీర్లు , సచివాలయ సిబ్బంది గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనాలని సర్పంచ్ కోరారు.