గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా తెనాలి మండ లంలో 35. 8 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా తాడికొండ మండలంలో 1. 2 మి. మీ వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు బుధవారం తెలిపారు. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కాకుమాను 24. 6, కొల్లిపర 15. 6, ఫిరంగిపురం 3, గుంటూరు పశ్చిమ 2. 4, తుళ్ళూరు1. 8, గుంటూరు తూర్పు 1. 6, మి. మీ వర్షపాతం నమోదయింది.