పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజుపాలెం మండలంలో బుధవారం జరిగింది. చౌటపాపాయపాలెం గ్రామానికి చెందిన వల్లాల వెంకట్రావు (40) వ్యవసాయంతో పాటు గేదెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితికి చేరుకున్న అతడిని సత్తెనపల్లికి తరలించారు. ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.