మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరింది. మరణించిన వారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. ఐజ్వాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుంగ్ నదిపై రైల్వే వంతెన కూలింది. ఇప్పటివరకు 18 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఐదుగురి మృతదేహాలు లభ్యం కాలేదు. వారికోసం వెతుకులాట కొనసాగుతోంది.