అనంతపురం టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆరు నెలలుగా ఓట్ల తొలగింపుపై చర్చ జరుగుతున్నా వారం రోజుల్లో జరిగిన పరిణామాలపై సీఈసీ స్పందించిందన్నారు. తమ పోరాటం ఫలించిందని, కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఉత్తర్వుల్లో ఓ వ్యక్తి ఎక్కడైనా 5 కంటే ఎక్కువ డిలీశన్ కి పెడితే ఈఆర్డీ పర్సనల్గా వెరిఫై చేయాలని కేశవ్ అన్నారు.