తరగతి గదిలో తేలు కాటుకు గురై విద్యార్థి మృతి చెందిన ఘటన కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో చోటు చేసుకుంది. కోరుమిల్లికి చెందిన వై.ప్రసాద్, శ్రీదేవిల చిన్నకుమారుడు అభిలాష్(14) వాకతిప్ప జడ్పీహెచ్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గురువారం తరగతి గదిలో చెత్త తీస్తుండగా అభిలాష్ ఎడమ చేతిని తేలు కుట్టింది. విద్యార్థిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ.. రక్తపు వాంతులతో మృతి చెందాడు.