మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి దేవస్థానం కేశఖండనశాల కార్మికులు దశలవారీగా ఉద్యమం చేపట్టారు. దీనిలో భాగంగా గురువారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 110ని తక్షణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుడికి కనీస కమీషన్ రూ. 20 వేల రూపాయలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో శనివారం నుంచి విధులు బహిష్కరిస్తామన్నారు.