చెరుకుపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ శిబిరం నేటితో ముగుస్తుందని ఎంపీడీవో బి శ్రీనివాసరావు తెలిపారు. చెరుకుపల్లి మండలంలోని కుంచాల వారి పాలెం, గూడవల్లి, కనగాల, చెరుకుపల్లి గ్రామాలలో ఆధార్ శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. శుక్రవారం కనగాల, చెరుకుపల్లి లో ఆధార్ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.