నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతున్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. శుక్రవారం రేపల్లెలోని ఎంపీ కార్యాలయానికి వికలాంగురాలు వచ్చి తనకు పెన్షన్ రావడంలేదని తెలపగా అధికారులతో మాట్లాడి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశించడంతోపాటు వికలాంగురాలుకి ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఎంపీ మోపిదేవి కి దివ్యంగురాలు కృతజ్ఞతలు తెలిపారు.