వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతుల నాని గంజాయి మత్తులో పిచ్చివాగుడులు వాగుతున్నాడని.. సొల్లు చెప్పడంలో నానిను మించిన వాడు రాజకీయాల్లో లేరని వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బూతుల పంచాంగంతో ఎమ్మెల్యే పదవికి ఉన్న విలువ తీసేస్తున్నారన్నారు. గుడివాడకు పట్టిన దరిద్రాన్ని ప్రజలు ఇక భరించాల్సిన అవసరం లేదన్నారు. సినిమా చివర్లో విలన్ పరిస్థితే నానికి పడుతుందంటూ విరుచుకుపడ్డారు. లోకేశ్ చెయ్యాల్సింది ఆయన చేస్తారని.... నానిని తరిమికొట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. లోకేశ్ వ్యాఖ్యలకు కొడాలి నాని భయపడ్డారన్నారు. ‘‘ఈ నాలుగు రోజులు ఎంత చేయాలో చేస్కో. నీ బూతులు, సొల్లు కబుర్లు, కుల రాజకీయాలను ప్రజలు ఛీకొడుతూ అసహ్యించుకుంటున్నారు’’ అని తెలిపారు. చిరంజీవి ఫ్యాన్స్ దెబ్బకు కాళ్ళ బేరానికి వచ్చారన్నారు. ఆగస్ట్ నెలలో ప్రజల కరెంట్ బాధలు పట్టవని... వర్షాలతో నష్టపోయిన రైతులు కష్టాలు పట్టించుకోరని అన్నారు. జరగని పనులకు శంకుస్థాపనలు చేస్తూ.. గుడివాడ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. బూతుల నాని చెప్పేవన్నీ సొల్లు కబుర్లని ప్రజలు తెలుసుకున్నారని... ఎన్నికల్లో ప్రజలు కొట్టే దెబ్బకు రాష్ట్రం వదిలి పారిపోక తప్పదని వెనిగండ్ల రాము వ్యాఖ్యలు చేశారు.