బాపట్ల మండలం మురుకుండపాడులో విష జ్వరాలు వ్యాపించిన నేపథ్యంలో శుక్రవారం జిల్లా ఆర్డీవో గంధం రవీందర్ గ్రామంలో పర్యటించారు. పరిస్థితిపై ప్రజలను విచారించి వైద్యశాఖ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, డిపిఓ రాంబాబు, తహశీల్దార్ సుధారాణి, గ్రామీణ మంచినీటి సరఫరా అధికారి మంజూర్ బాషా గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం అధికారులు పాల్గొన్నారు.