చంద్రయాన్-3 కోసం పని చేసిన ఐదుగురు డైరెక్టర్లలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి మండలంలోని తడుకుపేటకు చెందిన కల్పన ఒకరు. చంద్రయాన్-3 కోసం ఆమె అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. చంద్రయాన్-2 సక్సెస్ కావడంతో ఆమె సొంతూరు తడుకుపేటలో సంబరాలు చేసుకున్నారు. కల్పన తండ్రి మునిరత్నం చెన్నై హైకోర్టులో అధికారిగా పని చేసి రిటైరయ్యారు. దీంతో ఆమె చెన్నైలోనే చదువుకున్నారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేసిన కల్పన.. 2000 సంవత్సరంలో ఇస్రరోలో ఇంజినీర్‌గా ఎంపికయ్యారు. శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఐదేళ్లపాటు పని చేసిన ఆమె.. తర్వాత బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌కు బదిలీ అయ్యారు.