మోపిదేవిలో కొలువుతీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు శుక్రవారం దర్శించుకున్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, రాష్ట్ర పార్టీ కార్యదర్శి మట్టా ప్రసాద్ లు ఆలయ ఆవరణలో గల నాగ పుట్టలో పాలు పోసి, మ్రొక్కుబడులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు