సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొని సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. గ్రామ స్వరాజ్య పాలన అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సచివాలయాలకు శ్రీకారం చుట్టారని జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలియజేశారు.