రోగ నిర్ధారణ పరీక్షలు పక్కాగా నిర్వహిం చి, ప్రజలు సీజనల్ రోగాల బారిన పడకుండా అప్రమ త్తంగా ఉండాలని విజయనగరం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి టి.జగన్మోహన్‌రావు సూచించారు. చంద్రంపేట గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జ్వర లక్షణాలతో ఎవరైనా ఉన్నారా అని సిబ్బందిని ఆరా తీశారు. ఓపీ రికార్డులో వివిధ అనారోగ్య సమస్యలతో శిబిరానికి వచ్చిన వారికి చేపట్టిన ఆరోగ్య తనిఖీలు, పరీక్షలను పరిశీ లించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో జ్వరాలను గుర్తిస్తే వెంటనే మలేరియా, డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. అనంతరం గర్భిణుల ఆరోగ్య తనిఖీల కార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.