నేటి నుంచి ఎస్‌ఐ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు గుంటూరు రేంజ్ ఐజీ పాల్‌రాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అధికారులతో కలసి పెరేడ్‌గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను డెమో ద్వారా పరిశీలించి తగు జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా రేంజ్ ఐజీ, ఎస్పీలు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన 100 మీటర్లు, 1600 మీటర్ల పరుగుపందెం, ఎత్తు, బరువు, ఛాతి కొలతలు, లాంగ్ జంప్ చేేస ప్రదేశాలను పరిశీలించి అభ్యర్థులకు ఎలాంటి అటంకాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. దేహదారుఢ్య, సామర్థ్య పరీక్షలను అనుమానాలకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు రేంజ్ పరిధిలో 12,957మంది అభ్యర్థులు పాల్గొంటున్నారన్నారు. ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుండి దేహదారుఢ్య పరీక్షల ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ప్రతి రోజు మొదటగా అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన, ఫిజికల్ మెజర్‌మెంట్స్ చేసారన్నారు. తర్వాత బయోమెట్రిక్ తీసుకుంటారన్నారు. దేహదారుఢ్య పరీక్షలలో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్‌జంప్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు ఉద్యోగం కోసం దళారుల మాటలు నమ్మవద్దని కోరారు. ఆగస్టు 26నుండి సెప్టెంబర్ 16వ తే దీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం ఖచ్చితంగా ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. లేటెస్ట్ కుల ధ్రువీకరణ, క్రిమిలేయర్ సర్టిఫికెట్స్ తీసుకురావాలన్నారు. వాటితో పాటు ఆధార్, అడ్మిట్ కార్డు, స్టడీ, మార్స్క్‌లిస్టులు తీసుకుని రావాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కే కోటేశ్వరరావు, ఒంగోలు అదనపు ఎస్పీ అశోక్‌బాబు, రేంజ్ పరిధిలో డీఎస్పీలు, వెస్ట్ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ బాలసుందరరావు, డీసీఆర్బీ డీఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, స్పెషల్ బ్రాంచ్ సీఐలు బాలసుబ్రమణ్యం, శ్రీనివాసరావు, నగరంపాలెం సీఐ హైమారావు, ఐ.ఈ సీఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.