గుంటూరు జిల్లా జీజీహెచ్ పెట్ సీటీ స్కాన్ పంపిణీ చేసేందుకు టెండర్లను ఆహ్వానిస్తూ శనివారం ఏపీ ఎంఎస్ఐడీసీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 25 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు టెండర్లకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సెప్టెంబరు 9న టెండర్లు ఓపెన్ చేయనున్నారు. గుంటూరు జీజీహెచ్ నాట్కోక్యాన్సర్ సెంటర్లో పెట్ సీటీస్కాన్ అందుబాటులోకి రావడంవల్ల రోగులకు ఎంతోమేలు జరుగుతోంది.