తెనాలి పట్టణంలో నివాసముండే మహిళ తన కుమార్తె పెళ్లి ఖర్చుల నిమిత్తం శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి రూ. 2 లక్షలు అప్పుగా తీసుకుని వడ్డీతో సహా చెల్లించింది. అయినా శ్రీనివాసరావు ఆ మహిళకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడి, మార్ఫింగ్ ఫోటోలను బాధిత మహిళ భర్తకు పంపాడు. ఆమె ఎస్ ఓ ఎస్ కు ఫిర్యాదు చేయగా పోలీసులు శనివారం అతన్ని ఆదుపులోకి తీసుకున్నారు.