ఒకే సమయంలో రెండు తుపాన్లు దగ్గరికొచ్చినప్పుడు వాటి గమనాన్ని అంచనావేసి, నష్ట తీవ్రతను ముందే హెచ్చరించే అంశం శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. నావెల్ ఫ్రేమ్‌వర్క్ విధానాలను ఉపయోగించి తుపానుల తీవ్రత అంచనాలను కచ్చితంగా తెలుసుకోవచ్చని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్, జర్మనీకి చెందిన పోట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు.