మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ శివంపేట మండల పరిధిలోని సికిందలాపూర్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభు లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రావణమాసం సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ధనుంజయ్ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.