కేరళ ప్రజలు అత్యంత ప్రతిష్టగా జరుపుకునే ఓనం పండుగ సందర్భంగా వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్) ప్రభుత్వం షెడ్యూల్ తరగతుల (ఎస్సీ) కుటుంబాలకు ఆర్థిక చేయూతనందించింది. ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున నగదు బహుమతిని అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా 60 సంవత్సరాలు పైబడిన 55,781 మంది ఎస్సీ లబ్దిదారులకు ఈ కానుకను అందజేశారు. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.