చంద్రయాన్-3 మిషన్‌కు ఇచ్చిన మూడు లక్ష్యాల్లో ఇప్పటికే రెండింటిని పూర్తి చేసింది. మూడో లక్ష్యం కూడా పూర్తి చేసేందుకు భారత మూన్ మిషన్ పని చేస్తోంది. ఈ విషయాన్ని ఇస్రో శనివారం వెల్లడించింది. చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. మూడో లక్ష్యమైన అంతర్గత శాస్త్రీయ ప్రయోగాలు అని, అది కూడా పూర్తయ్యే దశలో ఉందని పేర్కొంది.