నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. పశ్చిమ, నైరుతి గాలులు, రుతుపవనాల ప్రభావం రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఛాన్స్ ఉందని చెప్పారు. అలాగే మిగిలిన జిల్లాల్లోనూ జల్లులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక శనివారం చిత్తూరు జిల్లా రామాపురంలో 3.1 సెం.మీ, నంద్యాల జిల్లా చిలకలూరు, తిరుపతి జిల్లా అరణ్యకండ్రిగ, అనంతపురం జిల్లా చిటికలపల్లె 2.7, సత్యసాయి జిల్లా గోరంట్లలో 2.4, ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో 2.3 సెం.మీ.చొప్పున వర్షపాతం నమోదైంది.
ఉత్తర బంగాళాఖాతం వరకు విస్తరించిన రుతుపవనాలతో తెలంగాణలోనూ మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, వరంగల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.