హర్యానాలోని నుహ్లో కొన్నాళ్లుగా అల్లర్లు జరుగుతున్న క్రమంలో సోమవారం (ఆగస్టు 28) ఆ ప్రాంతంలో శోభాయాత్ర నిర్వహించేందుకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) సన్నాహాలు చేస్తోంది. ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత సెలవు ప్రకటించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.