విజయనగరం జిల్లా, సీతానగరం మండలంలో కాశీపేట గ్రామ సమీపంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే... సీతానగరం మండలంలో కాశీ పేట గ్రామానికి చెందిన శంఖు శ్రీనివాసరావు(47) గ్రామంలో శివాలయం పూజారిగా జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున సుమారు 6 గంటల ప్రాంతంలో గ్రామసమీపంలోని పద్మనాభం చెరువు వైపు బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పట్టాలు దాటుతుండగా గూడ్స్ ట్రైన్ ఢీ కొంది. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. బొబ్బిలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.