విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఇండిస్టీ 4. 0 కేంద్రం ఏర్పాటు కానుంది. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే సమ్రత్ ఉద్యోగ్ టెక్నాలజీ ఫోరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సదాశివ్ పాఢి, ఆపరేషన్స్ విభాగాధిపతి రాజేష్ పహాడిలు ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని సోమవారం సందర్శించారు. ఏయూలో ఇండిస్టీ 4. 0 కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రాంతం, భవనాలు తదితర అంశాలను పరిశీలించడానికి వచ్చారు.