గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంలో గ్రంధి శ్రీలక్ష్మి, హరిహర కుమార్ రాజరాజేశ్వరి డ్వాక్రా మహిళా స్వయం సహాయక సంఘం గ్రూప్ ఏర్పాటు చేసిన నూతన వస్త్ర వ్యాపారాన్ని సోమవారం మచిలీపట్టణం పోర్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మేకతోటి దయాసాగర్ ప్రారంభించారు. నూతన వ్యాపార అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. డ్వాక్రా ఏపిఎంతోపాటు సిబ్బంది, వైసిపి నాయకులు పాల్గొన్నారు.