తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం 68,263 మంది భక్తులు వెంకటేశుని దర్శించుకున్నారు. 28,355 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు నేటితో యుగియనుండగా, రేపటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తారు.