ఏపీ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ముకుల్ చంద్ర బోత్రా అనే ఫైనాన్షియర్ కారణంగా తాను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని సెల్వమణి ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. దీనిపై ముకుంద్ పరువు నష్టం దావా వేశారు. ముకుంద్ చనిపోయినా ఆయన కుమారుడు గగన్ బోత్రా కేసు కొనసాగిస్తున్నారు. సోమవారం సెల్వమణి కేసు విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.