వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. సిలిండర్‌పై రూ.200 తగ్గించింది. ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ పొందినవారికి సబ్సిడీ కింద ఇప్పటికే రూ.200 ఇస్తుండగా, ఈ తగ్గింపుతో వారికి రూ.400 ప్రయోజనం చేకూరనుంది. ఈ తగ్గింపుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సెటైర్లు వేశారు. రెండు నెలల కాలంలో I.N.D.I.A. కూటమి కేవలం రెండు సమావేశాలు నిర్వహించిందని, ఈ రెండు సమావేశాల దెబ్బతో కేంద్రం గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించిందన్నారు. ఇదే I.N.D.I.A. దమ్ము అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ట్వీట్ చేశారు.