ఫ్లెక్స్ ఫ్యూయల్ విధానంలో రూపొందిన తొలి కారును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఆవిష్కరించారు. పెట్రోల్ లో ఇథనాల్ కలిపి ఇంధనంగా ఉపయోగించడమే ఫ్లెక్స్ విధానం. టయోటా ఇన్నోవా హైక్రాస్ కారుకు ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ అమర్చి బీఎస్-6 స్టేజ్-2 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు. భవిష్యత్తులో బైక్స్, ఆటోలు, ఈ-రిక్షాలు వంద శాతం ఇథనాల్ వాహనాలుగా మారాలని కోరుకుంటున్నట్ల గడ్కరీ తెలిపారు.