ఢిల్లీలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. అమెజాన్ మేనేజర్ గా పని చేస్తున్న హర్ ప్రీత్ గిల్ అనే వ్యక్తిపై ఐదుగురు దుండగులు కాల్పులు జరిపారు. ఓ ఫ్రెండ్ తో కలిసి బైక్ పై వెళ్తుండగా భజన్ పురా ఏరియాలోని సుభాష్ విహార్ వద్ద ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఓ బుల్లెట్ హర్ ప్రీత్ తలలోకి దూసుకుపోగా స్పాట్ లోనే మృతి చెందాడు. మిత్రునికి కూడా గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa