పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం తాటిగుంటపాలెంలో నూతనంగా నిర్మించనున్న వినాయక స్వామి ఆలయానికి బుధవారం రాష్ట్ర వైసిపి కార్యదర్శి పెద్దిరెడ్డి, జడ్పిటిసి సభ్యుడు సోమశేఖర్ రెడ్డి భూమి పూజ చేశారు. టిటిడి నిధులు రూ. 10 లక్షలతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నట్టు వారు తెలిపారు. మండలానికి 28 ఆలయాలు మంజూరు అయినట్లు వారు తెలియజేశారు.