పిడుగురాళ్ల పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వద్ద జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని వచ్చే నెల 9వ తేదీన నిర్వహించటం జరుగుతుందని లోక్ అదాలత్ ఛైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి గంగాధర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీపడదగిన క్రిమినల్ కేసులు, మనోవర్తి, చెక్ బౌన్స్ కేసులు, సివిల్ కేసులు, ప్రి లిటిగేషన్ కేసులు పరిష్కరించనున్నట్లు తెలియజేశారు.