పిచ్చాటూరు మండలంలోని కీలపూడి ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. నన్నయ, తిక్కన లాంటి మహా కవులు భాషా విస్తృతికి చేసిన ప్రయత్నాన్ని వివరించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల వారు సులభంగా మాట్లాడే విధంగా తెలుగు భాషను గిడుగు రామ్మూర్తి పంతులు అందించారని చెప్పారు.