బుధవారం విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలో గల జీవీఎంసీ 13వ వార్డు పరిధి సచివాలయం-8లో గల లక్ష్మీపార్వతి నగర్ జై భీమ్ నగర్ లో వార్డ్ కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణ ఆధ్వర్యంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు , తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ హాజరై ప్రతిగడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.