మురళీనగర్ సమీపం లోని అయ్యప్పనగర్ లో ముమ్మన శేష సాయి అనే మహిళ తను ఉంటున్న ఇంటికి పెయింటింగ్ పనులు చేయమని బంధువైన మోహన్ కు కాంట్రాక్ట్ ఇచ్చి చేయించారు. వరలక్ష్మి పూజల కోసం బీరువాలో ఉంచిన వెండి పూజా సామగ్రి కనిపించలేదు. దీంతో ఇంటి పెయింటింగ్ పనులు చేసిన సాయి, ఖాన్ ను గట్టిగా ప్రశ్నించడంతో వారు నిజం ఒప్పుకున్నారు. దీంతో బాధితురాలు శేష సాయి బుధవారం కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.