ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి మరో ప్రధాన మంత్రి అభ్యర్థి తెరపైకి వచ్చారు. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ ఈ కూటమికి సారథ్యం వహించాలన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రజల సమస్యలను నిరంతరం లేవనెత్తుతున్నారని చెప్పారు. ఆయన అమలు చేస్తున్న విధానాల వల్ల ఢిల్లీలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉందన్నారు.