టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వెల్దుర్తి మండలం, గొట్టిపాళ్లలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు గొడ్డళ్లతో దాడి చేయడాన్ని రాక్షస చర్యగా అభివర్ణించారు. జగన్ రెడ్డి గద్దెనెక్కినప్పటి నుంచి పల్నాడులో రక్తపుటేర్లు పారిస్తూనే ఉన్నారని, టీడీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతల ఇళ్లపై పడి రాళ్లు, కర్రలతో దాడి చేశారని, మహిళలను భయబ్రాంతులకు గురిచేయడం అమానుషమన్నారు.