సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ పూన్‌వాలా బుధవారం మలేరియాకు వ్యాక్సిన్‌ను కంపెనీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ భారతదేశంలోనే కాకుండా మలేరియా కేసులు ఎక్కువగా ఉన్న ఆఫ్రికాలో కూడా సహాయపడుతుందని ఆయన అన్నారు.భారతదేశంలోని అంతర్గత ప్రాంతాల ప్రజలు తరచుగా మలేరియా బారిన పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దోమల నుంచి ప్రజలకు వ్యాపించే మరో వైరల్ ఇన్‌ఫెక్షన్ డెంగ్యూకి వ్యాక్సిన్‌ను ఎస్‌ఐఐ సిద్ధం చేస్తోందని తెలిపారు. డెంగ్యూ వ్యాధికి ఏడాదిలో మందు సిద్ధమవుతుందని చెప్పారు.