న్యాయవ్యవస్థలో విపరీతమైన అవినీతి జరుగుతోందని, న్యాయవాదులు తీర్పును రూపొందించిన కేసులు కూడా ఉన్నాయని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం అన్నారు. ముందస్తు అంచనాలు లేకుండా దాడులు చేయడం వల్ల కేంద్ర ఏజెన్సీల ప్రతిష్ట మసకబారిందని గెహ్లాట్ అన్నారు.సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఆదాయపు పన్ను శాఖలకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తున్నాయని, ముందస్తు అంచనాలు వేయకుండానే ఏజెన్సీలు దాడులు నిర్వహిస్తున్నాయని ముఖ్యమంత్రి కేంద్రంపై విమర్శలు గుప్పించారు.బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని గెహ్లాట్ అన్నారు.