కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త అందించారు. గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కడం ద్వారా రైతు భరోసా సొమ్ము కౌలు రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుంది. అర్హులైన రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి జగన్ నేరుగా నగదు జమ చేస్తారు. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూముల సాగుదారులకు కూడా సాయం అందనుంది.