పెళ్లికి నిరాకరించిందని 13 ఏళ్ల బాలికను ఓ యువకుడు గన్ తో కాల్చి హతమార్చిన ఘటన పంజాబ్ అమృత్ సర్ లో జరిగింది. అజ్నాలకి చెందిన యువకుడు బాలికను ప్రేమ పేరుతో వేధించసాగాడు. దీంతో తల్లిదండ్రులు బాలికను బంధువుల ఇంటికి పంపగా, మంగళవారం సాయంత్రం అక్కడికి వెళ్లిన యువకుడు బాలికను పెళ్లి చేసుకోవాలని అడిగాడు. ఆమె నిరాకరించడంతో తుపాకీతో కాల్చి చంపాడు. వెంటనే పరారీ కాగా పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.