కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయడంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం పార్టీ నేత సిహెచ్. రామ్మూర్తి నాయుడు అన్నారు. రాజాం పట్టణంలో గురువారం జరిగిన సమర బేరి కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.