పదో తరగతి పరీక్షలలో గత ఏడాది ఫెయిలైన విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరం మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు రాసేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించినట్టు డీఈవో శామ్యూల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు ప్రైవేటు విద్యార్థుల నుంచి ఫీజులు స్వీకరించేందుకు గుంటూరు జిల్లా పరిధిలోని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, హెచ్ఎంలు విద్యార్థులతో సెప్టెంబర్ 15లోగా పరీక్ష ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.