ప్రేమపేరుతో వ్యక్తికి వలవేసి ఇంటికి పిలిపించి బెదిరించి డబ్బులు దోచుకున్న కేసులో మహిళతో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కొల్లిపర మండలంకు చెందిన మహిళ అదే మండలానికే చెందిన వ్యక్తిని ఇంటికి పిలిచి అప్పటికే సహజీవనం చేస్తున్న మరో వ్యక్తి అతని మిత్రుడితో కలిసి బెదిరించి రూ. 1.40 లక్షలు వసూలు చేసింది. తెనాలి పోలీసులు వీరిని అరెస్ట్ చేయగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.