రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విశాఖపట్టణం జిల్లా, కృష్ణాదేవిపేట, గొలుగొండ మండలం ఏఎల్ పురం, చోద్యం తదితర గ్రామాల్లో గత ఎన్నికల్లో ఏర్పాటు చేసిన పోలింగ్బూత్లను ఆర్డీవో హెచ్వీ జయరాం బుధవారం తహసీల్దార్ జి.ఆనందరావుతో కలిసి పరిశీలించారు. భవనాల పరిస్థితి, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ తదితరాలు ఉన్నవీ లేనివీ తెలుసుకు న్నారు. అలాగే ఏఎల్పురం ఎస్సీ కాలనీలో ఓటరు జాబితా సర్వే తీరును పరిశీలించారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నలు వేసి, సమాధానాలను రాబట్టారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.