రాష్ట్రంలో కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న సాగుదారులకు వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయడానికి ఏపీ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే నేడు జరగాల్సిన నిధుల విడుదల కార్యక్రమం రేపటికి వాయిదా పడింది. 2023-24 సీజన్ కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయాన్ని గురువారం అందించనున్నట్లు ముందు ప్రకటించారు. తాజాగా ఈ కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.