ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయీకి చెందిన ఇర్ఫాన్ అలియాస్ పప్పుబాబా.. తానొక్కడే పన్నెండేళ్లు కష్టపడి భూగర్భంలో రెండంతస్తుల మేడ కట్టాడు. పైకి బంకర్‌లా కనిపించే ఈ ఇంటిని తన పొలంలోని మట్టితో నిర్మించడం విశేషం. 2010లో తండ్రి చనిపోవడంతో ఇర్ఫాన్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో దృఢ సంకల్పంతో 2011లో ఈ ఇంటి నిర్మాణం మొదలుపెట్టి పాతకాలంలో మాదిరిగా అండాకారంలో ఇంటిగోడలను చెక్కాడు. ప్రార్థన మందిరం, డ్రాయింగ్ రూం.. ఇలా 11 గదులతో ఇల్లు అద్భుతంగా ఉంది.