ఢిల్లీ మెట్రోలో ఓ వ్యక్తి వికృత చర్యలకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి ఢిల్లీ మెట్రోలోని ‘రెడ్ లైన్’లో ఓ వ్యక్తి ఓ బాలికను చూస్తూ హస్త ప్రయోగం చేశాడు. కిక్కిరిసిన కోచ్ లో ఇలా చేయగా, బాలిక తల్లి గుర్తించింది. అధికారులకు ఫిర్యాదు చేయగా ఇద్దరు ప్రయాణికులు నిందితుడిని గుర్తించి మెట్రో అధికారులకు అప్పగించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా అతన్ని అరెస్ట్ చేశారు.